తెలంగాణ ఆర్టీసీ బిల్లుపై కొత్త ట్విస్ట్.. గవర్నర్‌ కీలక నిర్ణయం

తెలంగాణలో అటు ప్రభుత్వానికి ఇటు గవర్నర్‌ తమిళిసై మధ్య వార్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎప్పటి నుంచి సీఎం కేసీఆర్‌ ..

Update: 2023-08-18 02:39 GMT

తెలంగాణలో అటు ప్రభుత్వానికి ఇటు గవర్నర్‌ తమిళిసై మధ్య వార్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎప్పటి నుంచి సీఎం కేసీఆర్‌ గవర్నర్‌పై గుర్రుగా ఉన్నారు. అందుకు తగ్గట్లుగానే గవర్నర్‌ కూడా అంతే ఉన్నారు. అయితే ఇటీవల తెలంగాణ సర్కార్‌ ఆర్టీసీని విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఆర్టీసీ విలీనం బిల్లు కూడా ఇటీవల జరిగిన అసెంబ్లీలో కూడా ఆమోదం పొందింది. ఆర్టీసీ విలీన బిల్లుపై తెలంగాణ గవర్నర్‌ తమిళి సై న్యాయ సలహా కోరారు. ఈ క్రమంలో ఆర్టీసీ విలీన బిల్లుతో ఆటు ఇతర బిల్లులను కూడా న్యాయశాఖ కార్యదర్శికి పంపారు. గతంలో వెనక్కి పంపిన బిల్లులపై తాను చేసిన సిఫార్స్‌ల గురించి గవర్నర్‌ అడిగారు. సిఫార్స్‌ల ఆధారంగానే తగు నిర్ణయాలు తీసుకుంటామని రాజ్ భవన్‌ వర్గాలు తెలిపాయి. అయితే తనపై కావాలని దుష్పచారం చేస్తున్నారని, అలాంటివి ఏవీ కూడా నమ్మవద్దని గవర్నర్‌ తమిళి సై ఆర్టీసీ ఉద్యోగులను, ప్రజలు కోరారు. అసెంబ్లీలో ఆర్టీసీ విలీన బిల్లును ప్రవేశఫెట్టేందుకు గవర్నర్‌ అనుమతిస్తూ పలు సిఫార్సులు చేశారు.

గవర్నర్‌ సిఫార్సు చేసిన అంశాలలు

  • టీఎస్ఆర్‌టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కూడా రవాణా సంస్థకు చెందిన భూములు, ఆస్తులు దాని యాజమాన్యం చేతిలోనే ఉండాలి. దాని అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు.
  • ఏపీ పునిర్వభజన చట్టానికి తగినట్లుగానే టీఎస్‌ఆర్టీసీ ఆస్తులు విభజన చేయాలి.
  • ఉమ్మడి ఏపీఎస్‌ఆర్టీసీ నుంచి ఉద్యోగులకు అందాల్సిన బకాయిలు చెల్లింపు బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి.
  • విలీనం తర్వాత ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పేస్కేల్‌, సర్వీస్‌ నిబంధనలు ఉండాలి. అలాగే వేతనాల పెంపు, పదోన్నతులు తదితర సదుపాయాలు ఉండాలి.
  • ప్రభుత్వంలో విలీనం చేసుకున్న ఆర్టీసీ ఉద్యోగులను వేరే శాఖలకు డిప్యూటేషన్‌ మీద పంపినట్లయితే వారికి స్థాయికి తగ్గట్లుగానే సాలరీ, పదోన్నతులు, రక్షణ సదుపాయాలు తప్పనిసరిగ్గా ఉండాలి.
  • ఒక వేళ ఇతరులను కాంట్రాక్ట్‌పై నియమించుకున్నట్లయితే రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానం వేతనాలు, బెనిఫిట్స్‌ ఉండాలి.
  • ఉద్యోగులు ఆర్టీసీ ఉన్నంతకాలం ఆరోగ్యం విషయంలో చర్యలు చేపట్టాలి. ఆస్పత్రి సేవలు, చికిత్స, బీమా సదుపాయాలు ఉండాలి. బీమా పథకంలో వారి కుటుంబీకులను కూడా చేర్చాలి.
  • ప్రజల భద్రత కోసం బస్సుల నిర్వహణకు అయ్యే ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరించాలి.

Similar News