నేడు కాళేశ్వరానికి గవర్నర్
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు కాళేశ్వరం బయలు దేరి వెళ్లనున్నారు
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు కాళేశ్వరం బయలు దేరి వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలసి సరస్వతి పుష్కరాలకు వెళ్లనున్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన బయలుదేరి వెళతారు. సరస్వతి పుష్కరాలు మరో రెండు రోజులలో ముగియనున్న నేపథ్యంలో ఆయన నేడు కాళేశ్వరానికి బయలుదేరి వెళ్లనున్నారు.
పుణ్యస్నానాలు ఆచరించి...
కాళేశ్వరం లోని త్రివేణిసంగమం వద్ద గవర్నర్ దంపతులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అనంతరం కాళీశ్వరముక్తీశ్వర దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గవర్నర్ కాళేశ్వరానికి వస్తుండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం కావడంతో పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారని భావించి సామాన్యులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.