నేడు ఇఫ్లూతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

నేడు ఇఫ్లూతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది.

Update: 2025-09-09 03:51 GMT

నేడు ఇఫ్లూతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. సంగారెడ్డి మెడికల్ కాలేజీలో నేడు మంత్రి దామోదర ఆధ్వర్యంలో ఇఫ్లూతో ఒప్పందం చేసుకోనుంది. ప్రభుత్వం, ఇఫ్లూ ఒప్పందంతో విద్యార్థులకు మరింత బోధన విషయంలోనూ, సబ్జెక్ట్ విషయంలోనూ సులువుగా మారుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది.

విద్యార్థులకు ఉపయోగం...
ఇఫ్లూ తో ఒప్పందం కారణంగా విదేశీ భాషల్లో బోధన జరగనున్నాయి. విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాలనుకున్నవారికి, చదువుకున్న వారికి ఈ ఒప్పందం ఎంతో్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతుంది. తెలంగాణ ప్రభుత్వంతో ఇఫ్లూ ఒప్పందంలో నర్సింగ్ కాలేజీల్లోనూ జర్మన్‌, జపనీస్‌ భాష బోధన ఇకపై జరగనుంది. ఇది విద్యార్థులకు చక్కని అవకాశమని అంటున్నారు.


Tags:    

Similar News