Telangana : తెలంగాణలో విద్యాసంస్థలు జూన్ 13న తిరిగి ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2026-04-02 02:55 GMT

school holidays in AP today

ఎండలు దంచికొడుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పింది. వార్త చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవుల షెడ్యూల్ ను అధికారికంగా ఖరారు చేసింది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని స్కూళ్లకు సెలవులను అధికారులు ముందుగానే ప్రకటించారు.

48 రోజుల పాటు...
తెలంగాణలోని స్కూళ్లకు ఈ ఏడాది ఏకంగా 48 రోజుల పాటు వేసవి సెలవులు ఉండనున్నాయి. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు ఈ సెలవులు అమల్లో ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం జూన్ 12న తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.


Tags:    

Similar News