Breaking : "సుప్రీం"లో తెలంగాణ సర్కార్ కు దెబ్బ

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. కంచె గచ్చిబౌలి భూముల్లో స్టేటస్ కో కొనసాగుతుందని తెలిపారు

Update: 2025-04-16 06:36 GMT

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. కంచె గచ్చిబౌలి భూముల్లో స్టేటస్ కో కొనసాగుతుందని తెలిపారు. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని సుప్రీంకోర్టు గట్టిగా వ్యాఖ్యానించింది. అభివృద్ధి పేరుతో పర్యావరణానికి ముప్పు తేవద్దని హెచ్చరించింది. నగరంలో గ్రీన్ స్పేస్ ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో ....
చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని సుప్రీంకోర్టు నిలదీసింది. ప్రయివేటు ఫారెస్ట్ లో చెట్లు నరికివేసినా తాము సీరియస్ గా తీసుకుంటామని జస్టిస్ గవాయ్ ధర్మాసనం పేర్కొంది. అడవులను పరిరక్షించుకోవాల్సిన సమయంలో ఇలా నరికివేతకు పాల్పడితే ఎలా అని ప్రశ్నించింది. తదుపరి విచారణను మే 15వ తేదీ నాటికి వాయిదా వేసింది.


Tags:    

Similar News