ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Update: 2021-12-06 08:19 GMT

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో సీనియారిటీ ప్రాతిపదికన బదిలీలు నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణలో ప్రభుత్వోద్యోగులు అనేక ఏళ్లుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త జోనల్ విధానం వచ్చిన నాటి నుంచి బదిలీలు జరుగుతాయని భావించినా జరగలేదు. దీంతో ఉద్యోగులు ప్రభుత్వం ఉంచే తమ డిమాండ్లలో బదిలీలు ఒకటిగా మారింది.

స్థానికత ఆధారంగానే....
అయితే స్థానికత ఆధారంగానే బదిలీలు చేయనున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి ఉద్యోగుల విభజన చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే బదిలీ కార్యక్రమం ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. దివ్యాంగులకు, వితంతువులు, దీర్ఘకాలిక రోగులకు బదిలీల్లో వారి ప్రతిపాదనకు ప్రాధాన్యత ఇస్తామని అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News