Telangana : అంగన్ వాడీలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం అంగన్ వాడీలకు గుడ్ న్యూస్ చెప్పింది.
తెలంగాణ ప్రభుత్వం అంగన్ వాడీలకు గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్ వాడీ సిబ్బంది పదవీ విరమణ వయసు అరవైఐదేళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ను కూడా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్ వాడీ టీచర్లు పదవీ విరమణ చేసిన అనంతరం రెండు లక్షల రూపాయలు ప్రయోజనం కల్పించనుంది.
రిటైర్ మెంట్ బెనిఫిట్ ను...
గతంలో లక్ష రూపాయలు ఉన్న బెనిఫిట్ ను రెండు లక్షల రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అంగన్ వాడీ హెల్పర్లకు యాభై వేల రూపాయల నుంచిలక్షరూపాయలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలను జారీచేసింది. దీంతో గత కొద్ది కాలంగా అసంతృప్తిగా ఉన్న అంగనావాడీ సిబ్బందికి ఖుషీ కబురునుప్రబుత్వం అందించింది.