Telangana : రేవంత్ మరో కీలక నిర్ణయం.. మరోసారి సర్వే

తెలంగాణ ప్రభుత్వం మరోసారి కులగణన కోసం ఇంటింటి సర్వే నిర్వహించాలని నిర్ణయించింది.

Update: 2025-02-12 12:54 GMT

తెలంగాణ ప్రభుత్వం మరోసారి కులగణన కోసం ఇంటింటి సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. సర్వేకు కొందరు దూరం కావడంతో పాటు మరికొందరు ఉద్దేశ్యపూర్వకంగానే వివరాలు చెప్పకుండా ఉండటంతో మరోసారి సర్వే నిర్వహించాలని భావించింది. సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకూ మరోసారి సర్వే నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

ఈనెల 16 నుంచి...
ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో కులగణన సర్వే మరోసారిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మరోసారి సర్వేలో పాల్గొనేందుకు అవకాశం ఇస్తున్నామని తెలిపారు. ఈసారి అయినా తమ వివరాలను సిబ్బందికిఅందించాలని ఆయన కోరారు. సర్వే ఆధారంగానే సంక్షేమపథకాలు అమలవుతాయని ప్రభుత్వం భావిస్తుండటంతో మరోసారి సర్వే నిర్వహించాలని నిర్ణయించింది.


Tags:    

Similar News