ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2026-01-21 04:59 GMT

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మఇళ్ల పథకంలో మంజూరయిన వారికి నిధులను విడుదల చేసింది. ఈ పథకంలో భాగంగా ఇళ్లను నిర్మించుకుంటున్న దాదాపు ఇరవై మూడు వేల మంది లబ్దిదారులకు 262.51 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.

నగదు వారి ఖాతాల్లో...
దశలవారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న వారికి నిధులను విడుదల చేస్తుంది. ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలను చెల్లించనుంది. ప్రసతుతం వివిధ స్థాయిలో ఇంటి నిర్మాణ పనులను పూర్తి చేసిన లబ్దిదారులకు వారి ఖాతాల్లో నగదును జమ చేసినట్లు హౌసింగ్ కార్పరొరేషన్ ఎండీ వీపీ గౌతం తెలిపారు.


Tags:    

Similar News