Telangana : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇక వారికి మంచి రోజులు

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2026-01-22 04:53 GMT

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభాత్యాలను వారి ఖాతాల్లోనే జమ చేయనుంది. ఈ మేరకు తెలంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వేతనాల నిర్ణయం ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి అమలులోకి రానుంది. ఇప్పటి వరకూ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీత భత్యాలను వారికి కాకుండా కాంట్రాక్టు ఏజెన్సీలకు చెల్లించేది. వారు పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించకపోవడమే కాకుండా ఉద్యోగుల జీతభత్యాల్లో కోత విధించేవి. ఇవి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలా కాలంగా ఎదుర్కొన్న సమస్య.

నేరుగా బ్యాంకు ఖాతాల్లో...
అయితే కాంట్రాక్టు ఉద్యోగులు సమస్యకు చెక్ పెట్టేందుకు ఇక కాంట్రాక్టు ఏజెన్సీలకు కాకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జీత భత్యాలను జమ చేయనుంది. ఏజెన్సీల నుంచి మోసపోకుండా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టానికి తగిన ఫలితాన్ని వారికే చెందేలా నేరుగా చెందేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏజెన్సీలు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో భారీ కోత పెడుతుందని గుర్తించిన ప్రభుత్వం వారి కష్టాలను గట్టెక్కించడానికి అవసరమైన చర్యలను తీసుకోవడానికి ఉపక్రమించింది.
ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారానే...
పీఎఫ్, ఈఎస్ఐ వంటివి కూడా వారి ఖాతాల్లో జమ చేయకుండా పక్కదోవ పట్టిస్తున్నాయి అనేక ఏజెన్సీలు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు దుర్వినియోగం అవ్వడమే కాకుంండా పక్కదారి పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు ఐదు లక్షల మంది వరకూ ఉన్నారు. వీరిందరికీ ఏప్రిల్ నెల నుంచి ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారానే జీతభత్యాల చెల్లింపులు జరగనున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని వివిధ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను, పూర్తి సమాచారాన్ని సిద్ధం చేస్తుంది. అందరి వివరాలను కంప్యూటరీకరించిన తర్వాత బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ అంతా సిద్ధం చేస్తుంది.


Tags:    

Similar News