గద్దర్ అవార్డుల కోసం దరఖాస్తులు

సినిమా రంగంలో గద్దర్ అవార్డుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2026-01-20 06:16 GMT

సినిమా రంగంలో గద్దర్ అవార్డుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 సంవత్సరానికి 'గద్దర్ అవార్డులు' ఇవ్వనుంది. తెలంగాణ ఫిలిండెవలెప్ మెంట్ కార్పొరేషన్ కు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు నిర్మించిన చలనచిత్రాలకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది.

మొత్తం పదిహేడు విభాగాల్లో...
చిత్ర పరిశ్రమలో 17 విభాగాల్లో గద్దర్ అవార్డులకు దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. వ్యక్తిగత విభాగంలోనూ గద్దర్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానించింది. రేపటి నుంచి ఈ నెల 31 వరకు 'గద్దర్ అవార్డుల'కు దరఖాస్తుల స్వీకరించనున్నారు. ఎంపిక చేసిన జ్యూరీ చిత్రాలను పరిశీలించి వివిధ విభాగాల్లో అవార్డులను ప్రకటించనుంది.


Tags:    

Similar News