Telangana: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ..

Update: 2024-03-09 14:58 GMT

Telangana RTC

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జూన్ 1వ తేదీ నుంచి కొత్త ఫిట్‌మెంట్ అమ‌లు చేస్తున్నట్లు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వెల్లడించారు. తాజాగా సవరించిన వేతనాన్ని జూన్ 1వ తేదీ నుంచి ఉద్యోగుల అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు. కొత్త ఫిట్‌మెంట్‌తో ఆర్టీసీపై నెల‌కు 35 కోట్ల భారం ప‌డ‌నుంద‌ని వివరించిన మంత్రి.. కొత్త ఫిట్‌మెంట్ ద్వారా 53వేల 71 మంది ఆర్టీసీ ఉద్యోగుల‌కు ఆర్థిక ప్రయోజ‌నం చేకూరుతుందన్నారు. అలాగే కార్మికులకు బోనస్‌, ఇతర బెనిఫిట్స్‌ ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నామన్నారు.

21 శాతం ఫిట్‌మెంట్‌

కాగా, 21శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, దీంతో ప్రభుత్వంపై ప్రతి యేటా రూ.418.11కోట్ల భారం పడుతుందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సర్వీసులో ఉన్న 42,057 మంది ఎంప్లాయిస్‌కు, 2017 నుంచి రిటైర్డ్ అయిన 11,014 మంది ఉద్యోగులు మెుత్తంగా 53,071 మందికి ప్రయోజనం చేకూరుతుందని మంత్రి తెలిపారు.

Tags:    

Similar News