Telangana : నేడు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

నేడు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు జరగనున్నా

Update: 2025-06-02 01:38 GMT

నేడు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. హైదరాబాద్ లోని పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ అవతరణ వేడుకలకు ఏర్పాట్లు చేశారు. పరేడ్ లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సచివాలయం, అసెంబ్లీ వంటి ప్రభుత్వ భవనాలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు.

పరేడ్ గ్రౌండ్స్ లో...
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జపాన్‌లోని కిటాక్యూషు నగరమేయర్ టేకుచి పాల్గొననున్నారని తెిసింది. ఇటీవల కిటాక్యూషు నగరాన్ని సందర్శించిన రేవంత్‌కిటాక్యూషు మేయర్‌ను తెలంగాణకు రేవంత్ రెడ్డి ఆహ్వానించడంతో ఆయన హాజరయ్యే అవకాశముంది. మరోవైపు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేసే అవకాశముంది. ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగ నియామకాలపై రేవంత్ కీలక ప్రకటన చేసే చాన్స్ ఉంది.


Tags:    

Similar News