Liquor : నెలరోజుల్లో అంత తాగేశారా.. ఫ్రీగా వస్తుంటే... కోట్లాది రూపాయల విలువైన

తెలంగాణ ఎన్నికలు ఎక్సైజ్ శాఖకు మంచి ఆదాయాన్ని తెచ్చి పెట్టాయి. ఇరవై రోజుల్లోనే కోట్లాది రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి.

Update: 2023-12-02 03:29 GMT

తెలంగాణ ఎన్నికలు ఎక్సైజ్ శాఖకు మంచి ఆదాయాన్ని తెచ్చి పెట్టాయి. కేవలం ఇరవై రోజుల్లోనే కోట్లాది రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. నవంబరు నెలలో జరిగిన మద్యం అమ్మకాలను చూస్తే ఎవరికైనా కళ్లు తిరగాల్సిందే. దాదాపు 1470 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. నవంబరు 30వ తేదీన తెలంగాణ ఎన్నికలు జరిగాయి. అంతకు ముందు ఇరవై రోజులు జనం విపరీతంగా తాగేసినట్లు లెక్కలు చెబుతున్నాయి.

పాత రికార్డులను...
ఇది ఒకరకంగా గత రికార్డులను బద్దలు కొట్టడమే. 2022 1,260 కోట్ల మద్యం విక్రయాలను ఇది దాటేసింది. ఎన్నికల ప్రచారం మొదలు కావడం, అభ్యర్థులు తమతో ప్రచారం వచ్చే వారికి మద్యం, డబ్బులు పంచడంతోనే ఇది సాధ్యమయి ఉండవచ్చని చెబుతున్నారు. 119 నియోజకవర్గాల్లో మద్యం దుకాణాలు నిత్యం కళకళలాడిపోతున్నాయి. తమ డబ్బులు కాకపోవడంతో పూటుగా మద్యం తాగి ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో ఎక్కువగా బీర్లు సేల్ అయ్యాయని కూడా అంటున్నారు.
చివరి మూడు రోజులు...
చివరి మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ చేసినా అప్పటికే కొనుగోలు చేసి పెట్టుకున్న మద్యాన్ని తాగేశారు. ఇంత పెద్దమొత్తంలో మద్యం విక్రయాలు ఇటీవల కాలంలో జరగలేదని ఎక్సైజ్ శాఖ చెబుతుంది. బీర్లు ఎక్కువగా సేల్ అయ్యాయని, ఈ ఇరవై రోజుల్లో 22 కోట్ల కార్టన్ బీర్లు అమ్ముడు పోయాయని అధికారులు చెబుతున్నారు. మద్యం, డబ్బు ఏ స్థాయిలో ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిందో తెలియడానికి ఈ లెక్కలు చాలవు. ఒక్కో అభ్యర్థి మద్యం కొనుగోలు చేయడానికే కోట్లు ఖర్చు చేశారని వినికిడి


Tags:    

Similar News