Congress : నేడు హైదరాబాద్ కు మీనాక్షి నటజరాజన్
తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం సికింద్రాబాద్ కు చేరుకోనున్న మీనాక్షి నటరాజన్ నేతలతో సమావేశమవుతారు. స్థానిక ఎన్నికల పై చర్చించనున్నారు. అలాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై కూడా నేడు మీనాక్షి నటరాజన్ చర్చించనున్నారు. ఉప ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక తీరు, ప్రచార శైలిపై చర్చిస్తారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై...
మరొకవైపు నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థి ఎంపికపై నియమించిన మంత్రుల కమిటీ కసరత్తు కొనసాగుతుంది. నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరిని కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దింపాలన్న దానిపై పీసీసీకి మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. ముగ్గురి పేర్లను ప్రతిపాదించే అవకాశముంది. మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు కలసి కూర్చుని చర్చించి అధినాయకత్వానికి ఫైనల్ గా ఒక పేరును పంపే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.