Telangana : నేడు రోజంతా మీనాక్షి మీటింగ్స్
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ నేడు నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో సమీక్ష చేయనున్నారు
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ నేడు నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో సమీక్ష చేయనున్నారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ వరసగా సమీక్ష చేయాలని నిర్ణయించారు. కేవలం పార్లమెంటు నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో పాటు ఎమ్మెల్యేలు, అనుబంధ శాఖల నేతలను కూడా మీనాక్షి నటరాజన్ కలవనున్నారు.
నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో...
వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. ఆ యా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏంటి? బలోపేతానికి ఏం చేయాలి? ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? వంటి వివరాలను సేకరిస్తున్నారు. మరొకవైపు నేతల మధ్య విభేదాలను కూడా పరిష్కరించేందుకు ఈ సమావేశం ద్వారా మీనాక్షి నటరాజన్ ప్రయత్నిస్తున్నారు.