Telangana : నేడు ఆ నేతలతో మీనాక్షి భేటీ
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ వరసగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం అవుతున్నారు
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ వరసగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం అవుతున్నారు. వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఆ పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. అదే సమయంలో నేతల మధ్య సమన్వయంపై కూడా మీనాక్షి నటరాజన్ దృష్టి పెట్టారు.
పార్టీని బలోపేతం చేయడంపై...
దీంతో పాటు పార్టీని బలోపేతం చేయడంపై మీనాక్షి నటరాజన్ నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తెలుసుకుంటున్నారు. నేడు చేవెళ్ల, మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో ఆమె సమావేశం కానున్నారు. హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్ లో జరగనున్న ఈ సమావేశానికి నేతలు హాజరు కానున్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకూ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ లోనే ఉండనున్నారు.