Revanth Reddy : నేడు రెండో రోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది.

Update: 2025-06-10 03:16 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. నిన్న ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ తో సమావేశమయ్యారు. వివిధ రాజకీయ అంశాలతో పాటు రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీ, మిగిలిన మూడు మంత్రుల పోస్టుల నియామకంపై మాట్లాడిన రేవంత్ రెడ్డి నేడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీకానున్నారు.

మల్లికార్జున్ ఖర్గేతో జరిగే భేటీలో...
అయితే ఈరోజు మల్లికార్జున్ ఖర్గేతో జరిగే భేటీలోనూ ముగ్గురు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. దీంతో పాటు ఎస్సీ రిజర్వేషన్, కులగణనకు సంబంధించిన అంశాలపై తెలంగాణలో బహిరంగ సభలన నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం బహిరంగ సభలకు మల్లి కార్జునఖర్గే, రాహుల్ గాంధీలను రావాల్సిందిగా ఆహ్వానించనున్నారు.


Tags:    

Similar News