Revanth Reddy : నేడు ఢిల్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్
ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన కొనసాగుతుంది.
ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన కొనసాగుతుంది. నేడు కొందరు కేంద్ర మంత్రులను రేవంత్ రెడ్డి కలిసే అవకాశాలున్నాయి. ఇక ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకూ కేబినెట్ విస్తరణ జరగలేదు. రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కేబినెట్ విస్తరణపై...
దీంతో కేబినెట్ విస్తరణపై అధిష్ఠానంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. పార్టీ కార్యవర్గం విస్తరణపై చర్చించే అవకాశం కూడా ఉన్నట్లు తెలిసింది. దీనిపై చర్చించేందుకు రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్‌తో పాటు రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉందని తెలిసింది. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో రేవంత్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ దఫా మూడు కేబినెట్ బెర్త్‌లు భర్తీ చేస్తారంటూ ప్రచారం సాగుతుంది.