Telangana : నేడు నాగర్ కర్నూలు జిల్లాకు రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.

Update: 2025-07-18 01:59 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని నిన్న హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాోని కొల్లాపూర్ మండలం జటుప్రోలు మదనగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. జటుప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలుకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలుకు...
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలను చెక్కులను కూడా ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు భారీ జనసమీకరణ చేపట్టారు. అధికారులు ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News