Revanth Reddy : దావోస్ కు చేరుకున్న రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి దావోస్ లో పర్యటించనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి దావోస్ లో పర్యటించనున్నారు. దావోస ఎకనమిక్ ఫోరంలో ఆయన బృందం పాల్గొననుంది. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడే లక్ష్యంగా ముఖ్యమంత్రి దావోస్ పర్యటన సాగనుంది. గత ఏడాది దావోస్ పర్యటన నుంచి తెలంగాణఖు నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులును తెచ్చిన రేవంత్ రెడ్డి బృందం ఈ ఏడాది ఎన్నికోట్లను తెస్తుందన్న దానిపై ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది.
అనుకూలతలు ఇవే...
హైదరాబాద్ వంటి నగరం, అనుకూలమైన వాతావరణంతో పాటు అనుభజ్ఞులైన అధికారులు రేవంత్ పర్యటనకు మరింత పెట్టుబడులు తెచ్చిపెడతాయని భావిస్తున్నారు. దావోస్ పర్యటన కంటే ముందుగానే రేవంత్ రెడ్డి బృందం సింగపూర్ లో మూడు రోజుల పాటు పర్యటించింది. 3,500 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది.