Revanth Reddy : బీహార్, తమిళనాడుకు రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 23వ తేదీన బీహార్ రాష్ట్రానికి వెళ్లనున్నారు

Update: 2025-09-21 05:54 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 23వ తేదీన బీహార్ రాష్ట్రానికి వెళ్లనున్నారు. ఈ నెల 24వ తేదీన పాట్నాలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు ఈనెల 23వ తేదీన రేవంత్ రెడ్డి బీహార్ లోని పాట్నాకు బయలుదేరి వెళతారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

సీడబ్ల్యూసీ సమావేశంలో...
24వ తేదీన పాట్నాలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనే రేవంత్ రెడ్డి అదే రోజు అక్కడి నుంచి బయలుదేరి చెన్నైకి చేరుకుంటారు. 25వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. ఓట్ చోరీ సమావేశానికి రావాల్సిందిగా రేవంత్ రెడ్డిని స్టాలిన్ ఆహ్వానించడంతో ఆయన బయలుదేరి వెళ్లి సమావేశంలో పాల్గొన్న అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.


Tags:    

Similar News