Revanth Reddy : నేడు కీలక శాఖలపై సమీక్ష చేయనున్న రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పలు శాఖలపై సమీక్షలు చేయనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పలు శాఖలపై సమీక్షలు చేయనున్నారు. ఆర్ధిక శాఖ, దేవాదాయశాఖ శాఖలపై ఆయన సమీక్ష చేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు కమాండ్ కంట్రోల్ రూంలో స్థానిక సంస్థలపై అధికారులు, మంత్రులతో సమీక్ష చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల తేదీలను ఖరారు చేయనున్నారు.
ఆర్థిక శాఖపై సమీక్ష...
అలాగే ఈరోజు సాయంత్రం సచివాలయంలో ఆర్థిక శాఖపై సమీక్ష చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన అధికారులతో చర్చించనున్నారు. హామీల అమలు గురించి, నిధుల కేటాయింపు పై చర్చించనున్నారు. అదే సమయంలో దేవాదాయ శాఖ అధికారులతో సమావేశమై ఆలయాల అభివృద్ధిపై చర్చిస్తారు. దీంతో పాటు యాదగిరిగుట్ట పాలకమండలిపై కూడా చర్చించే అవకాశముంది.