Revanth Redddy: నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు

Update: 2025-06-09 03:12 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం పది గంటలకు ఆయన ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలవనున్నారు. కొత్తగా కేబినెట్ లోకి తీసుకున్న మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు వివిధ అంశాలపై పార్టీ హైకమాండ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారని చెబుతున్నారు.

కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల భర్తీ...
దీంతో పాటు పీసీసీ కార్యవర్గంతో పాటు కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల భర్తీపై కూడా పార్టీ అగ్రనేతలతో చర్చించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తుండటంతో ఇక నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరనున్నారు. మంత్రివర్గంలో నెలకొన్న అసంతృప్తులపై కూడా చర్చించనున్నారు.


Tags:    

Similar News