Revanth Reddy : నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు

Update: 2025-06-18 03:38 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పార్టీ నేతలతో పాటు వివిధ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి స్థానిక సంస్థల ఎన్నికల విషయమై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో చర్చించనున్నారు.

రెండు రోజుల పాటు పర్యటన...
కాంగ్రెస్‌ అధిష్ఠానం తో సమావేశం అవ్వడంతో పాటు, కేంద్రమంత్రులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. ఈ పర్యటనలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంగ్లండ్‌ మాజీ ప్రధాని టోని బ్లెయిర్‌తో భేటీ అవుతారు. టోని బ్లెయిర్‌ గ్లోబల్‌ చేంజ్‌ ప్రతినిధులతో చర్చలు జరుపుతారు.పెట్టుబడులపై కీలక సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.


Tags:    

Similar News