Telangana : నేడు రేవంత్ మూడింటిపై కీలక సమీక్ష

Telangana : నేడు రేవంత్ మూడింటిపై కీలక సమీక్ష

Update: 2025-04-29 02:02 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మూడు కీలక అంశాలపై సమీక్షలను నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఇచ్చిన ప్రాధాన్యత అంశాలను ఆయన పరిశీలించనున్నారు. రేవంత్ రెడ్డి నిన్ననే మీడియా చిట్ చాట్ లో చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి ఇకపై చెప్పినవి చెప్పినట్లు గ్రౌండ్ అయ్యేటట్లు చేస్తానని అన్నారు. అందుకు తగినట్లుగానే నేడు సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.

మూడు అంశాలపై...
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు. ఇది ఇటీవల కాలంలో కొంత ఆగింది. దీంతో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవంపై సమీక్ష చేయనున్నారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మాణ పనులను కూడా ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. దీంతో పాటు తన ప్రభుత్వం తెచ్చిన హైడ్రాపై సమీక్ష చేసి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.


Tags:    

Similar News