Revanth Reddy : మూడు రోజులుగా ఢిల్లీలోనే రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. రేవంత్ రెడ్డి గత మూడు రోజుల నుంచి ఢిల్లీలోనే గడుపుతున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి ఆ సమావేశం ముగిసిన తర్వాత పార్టీ పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై పార్టీ అధినాయకత్వంతో చర్చిస్తున్నారు.
మంత్రి వర్గ విస్తరణపై...
ప్రధానంగా మంత్రి వర్గ విస్తరణపై నేడు చర్చించనున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమై మంత్రి వర్గ విస్తరణపై చర్చించే అవకాశముంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ చేరుకోవడంతో ఇద్దరూ కలసి మంత్రి వర్గ విస్తరణపై చర్చించి హైకమాండ్ అనుమతిని పొందే అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. రేవంత్ కేబినెట్ లో మిగిలిపోయిన ఆరు మంత్రివర్గ పోస్టుల్లో కనీసం మూడు పోస్టులనయినా భర్తీ చేయాలని కోరుతున్నారు.