Revanth Reddy : నేడు యాదాద్రి జిల్లాకు రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు యాదాద్రి జిల్లాలో పర్యటించనున్నారు

Update: 2025-06-06 03:29 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు యాదాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. ఆలేరు నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తారు. ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం, తిరుమలాపురంలోని గంధమల్ల రిజర్వాయర్ పనుకలు, పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం తిరుమలాపురంలో జరిగే బహిరంగ సభలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొంటారు.

బహిరంగ సభ అనంతరం...
బహిరంగ సభ అనంతరం తిరిగి ఆయన హైదరాబాద్ కు బయలుదేరి వస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పాటు బహిరంగ సభ నిర్వహిస్తున్న దృష్ట్యా ప్రజ్ఞాపూర్ - భువనగిరిల మధ్య వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. వాటిని అవుటర్ రింగ్ రోడ్డు మీదుగా మళ్లించనున్నారు.


Tags:    

Similar News