Revanth Reddy : నేడు సంగారెడ్డి జిల్లాలో రేవంత్ పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు

Update: 2025-05-23 02:03 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. మొత్తం 494 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో బబసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

పలు అభివృద్ధి కార్యక్రమాలను...
అనంతరం అక్కడ కేంద్రీయ విద్యాలయాన్ని కూడా ప్రారంభించిన అనంతరం రేవంత్ రెడ్డి పస్తాపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. బహిరంగ సభకు సంగారెడ్డి జిల్లా నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులను పార్టీ నేతలను తరలించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళతారు. రేపు జరగనున్న నీతి అయోగ్ సమావేశంలో పాల్గొంటారు.


Tags:    

Similar News