Revanth Reddy : నేడు నాగర్ కర్నూలు జిల్లాకు రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు

Update: 2025-05-19 02:32 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మొత్తం పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం...
దీంతో పాటు లబ్దిదారులకు సోలార్ పంప్ సెట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిణీ చేయనున్నారు. అనంతరం నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. జిల్లా నలుమూలల నుంచి రేవంత్ పర్యటనకు కార్యకర్తలు, పార్టీ అభిమానులు హాజరు కానున్నారు. పోలీసులు భారీ బందోబ్తును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News