Revanth Reddy : నేడు ఫ్యూచర్ సిటీకి రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఫ్యూచర్ సిటీకి రానున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఫ్యూచర్ సిటీకి రానున్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ప్రాంతంలో రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ రోజు ఫ్యూచర్ సిటీలో కొన్ని నిర్మాణాలకు భూమి పూజ చేయనున్నారు. భవిష్యత్ నగరాన్ని నిర్మించే బాధ్యతను ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ డెవలెప్ మెంట్ అథారిటీకి అప్పగించింది.
భూమిపూజను నిర్వహించనున్న...
ఈ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలిన ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ డెవలెప్ మెంట్ అథారిటీ కార్యాలయాన్ని కూడా అక్కడే నిర్మించాలని నిర్ణయించారు. పందొమ్మిది కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. దీంతో పాటు మరో ఇరవై ఎకరాల్లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్ మెంట్ కార్యాలయాన్ని కూడా నిర్మించనున్నారు. దీనికి స్థలం కేటాయించడంతో దీనికి సంబంధించిన నిర్మాణ పనులు కూడా త్వరలో పూర్తి కానున్నాయి.