Revanth Reddy : నేడు రేవంత్ రెడ్డి సమీక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పలు శాఖలపై సమీక్ష చేయనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పలు శాఖలపై సమీక్ష చేయనున్నారు. ప్రధానంగా ఇరిగేషన్, ఆర్ అండ్ బి, హెచ్ఎండీఏ రోడ్డు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష చేయనున్నారు. ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ఐసీసీసీలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరపనున్నారు. కృష్ణా జలాలు ఎండిపోవడంతో పాటు బనక చర్ల ప్రాజెక్టు ను ఏపీ నిర్మాణం చేపట్టాలని భావించడంతో దానిపై కూడా చర్చించనున్నారు.
అనేక శాఖలపై సమీక్ష...
బనకచర్లను ఏ విధంగా అడ్డుకోవాలన్న దానిపై అధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లితే ఊరుకోబోమని హెచ్చరికలు జారీ చేసేలా చర్యలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆర్ అండ్ బీ, హెచ్ఎండీఏ రోడ్డు ప్రాజెక్టులపై అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం అయి పనుల పురోగతిపై చర్చించనున్నారు.