Revanth Reddy : కవిత కామెంట్స్ పై రేవంత్ మాటలు విన్న తర్వాత?
కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. హారీశ్ రావు, సంతోష్ రావుల వెనక తాను ఉన్నానని అనడంపై ఆయన రియాక్ట్ అయ్యారు. తాను ఎవరి వెనకో ఉండేవాడిని కానని, అందులో పనికి మాలిన వారి వెనక అసలు ఉండనని, తాను నాయకుడనని, ముందే ఉంటానని, కార్యకర్తలకు అండగా ఉంటానని రేవంత్ రెడ్డి అన్నారు.
విభేదాలకు కారణం...
కల్వకుంట్ల కుటుంబంలో రచ్చకెక్కిన విభేదాలకు ప్రధాన కారణం ఆస్తుల పంపకాల వల్లనే వచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు. పంపకాల్లో తేడా రావడంతోనే వారు కడుపులో కత్తులు పెట్టుకుని దూసుకుంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కాలగర్భంలో కలసి పోతుందన్న రేవంత్ రెడ్డి, జనతా పార్టీకి పట్టిన గతే మీకు కూడా పడుతుందని హెచ్చరించారు. మీ కుటుంబ పంచాయతీలోకి తనను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు.