Revanth Reddy : దత్తన్నను ఉప ముఖ్యమంత్రిని చేయాలి
బండారు దత్తాత్రేయను ఉప రాష్ట్రపతిని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు
బండారు దత్తాత్రేయను ఉప రాష్ట్రపతిని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దత్తన్నను ఉప రాష్ట్రపతిగా చేసినప్పుడే బీసీలకు న్యాయం చేసినట్లు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో తమ ప్రభుత్వం పంపిన బీసీ కులగణన కు ఆమోదించాలని కూడా ఆయన కోరారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతికి పంపామన్న రేవంత్ రెడ్డి బిల్లు ఆమోదం కోసం కేంద్రంలోని విపక్ష నేతలను కలసి మద్దతు కూడగట్టి కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో...
సెప్టంబరు లోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం త్వరగా రిజర్వేషన్ బిల్లు ఆమోదిస్తే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు. ముస్లింల రిజర్వేషన్లు తొలగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారని, యూపీ, గుజరాత్ , మహారాష్ట్ర వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రిజర్వేషన్లను ఎందుకు తొలగించలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.