Telangana : నేడు ముంబయికి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ముంబయికి బయలుదేరి వెళ్లనున్నారు

Update: 2026-01-04 03:11 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ముంబయికి బయలుదేరి వెళ్లనున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో సమావేశం కానున్నారు. రేవంత్ రెడ్డి వెంట ముంబయికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లనున్నారు. రేపు సుప్రీంకోర్టులో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు కేసు విచారణ ఉంది.

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు....
ఈ కేసు విచారణ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి నేడు ముంబయికి వెళ్లి తమ వద్ద పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పాటు సెంట్రల్ వాటర్ కమిషన్ తో పాటు, కృష్ణా నదీ జలాల యాజమాన్యం బోర్డు ఆదేశాలను ఆయనకు అందచేయనున్నారు. కేవలం పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి చర్చించడానికే ఆయన బయలుదేరి ముంబయి వెళుతున్నారు.


Tags:    

Similar News