విలన్లు క్లైమాక్స్ లోనే అరెస్ట్ అవుతారు : రేవంత్ రెడ్డి
మీడియా చిట్‌చాట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు
మీడియా చిట్‌చాట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుగుతోందన్నరేవంత్ రెడ్డి విలన్లు క్లైమాక్స్‌లోనే అరెస్ట్ అవుతారంటూ హింట్ ఇచ్చారు. ఢిల్లీలో మీడియా మిత్రులతో జరిగిన చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ డ్రగ్స్ కేసులోనూ విచారణ జరుగుతోందన్నారు.
అన్ని విచారణలు...
కాళేశ్వరంపై కమిషన్ విచారణ జరుగుతుందని, అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో న్యాయస్థానం ఆదేశాల మేరకు విచారణ చివరి దశకు చేరుకుందని అన్నారు. ప్రభాకర్ రావు ఏడాది కాలం నుంచి విదేశాల్లో ఉన్నందున ఫోన్ ట్యాపింగ్ కేసువేగంగా జరగలేదన్నరేవంత్ రెడ్డి, ఫార్ములా ఈ కారు రేసింగ్ పై కూడా విచారణ జరుగుతుందని చెప్పారు. విచారణలో ప్రభుత్వం జోక్యం ఉండదని, అధికారులకు ఫ్రీహ్యాండ్ ఇచ్చామని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై తమ వ్యూహం మకుందన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ సభకు రావాలని కోరారు.