Revanth Reddy : నేడు ఢిల్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈరోజు కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈరోజు కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. కొందరు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ ను కోరినట్లు తెలిసింది. నిన్న కొందరు కేంద్ర మంత్రులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కురిసిన వరదల వల్ల సంభవించిన నష్టం అంచనాలపై కేంద్రం నుంచి సాయం కావాలని కోరారు. అలాగే యూరియా కొరతను కూడా తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలను ముఖ్యమంత్రి కలిశారు.
రాజ్ నాథ్ సింగ్ తో నేడు...
ఈరోజు ఉదయం పది గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. రాష్ట్రంలో రక్షణ శాఖ భూముల బదలాయింపుతో పాటు, రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన సైనిక్ స్కూల్స్ పైన కూడా రాజ్ నాధ్ సింగ్ తో రేవంత్ చర్చించనున్నారు. మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశముంది. ఈరోజు ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ కు చేరుకుంటారు.