Revanth Reddy : నేడు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి ఈరోజు ఢిల్లీలో పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ పార్ట్ నర్ స్టేట్ లాంజ్ లో పీఏఎఫ్ఐ ఆధ్వర్యంలో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి మర్ఫీతో ద్వైపాక్షిక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని అధికారులు తెలిపారు.
ఉదయం నుంచి...
తర్వాత పన్నెండవ వార్షిక ఫోరంలో పాల్గొన్న ప్రతినిధులను ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. అనంతరం వివిధ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. ఇందులో ఉబెర్, గోద్రెజ్, కార్ల్ బర్గ్, అమెజాన్ వంటి ప్రతినిధులు పాల్గొంటారని అధికారులు తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను వారికి వివరించనున్నరు. అనంతరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్గే బ్రెండేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఆహ్వానించేందుకు ఈ ఢిల్లీ పర్యటనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినియోగించుకోనున్నారు.