Revanth Reddy : మూడో రోజు ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి
మూడోరోజు ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారు.
మూడోరోజు ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీకి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలు చేరుకున్నారు.మంత్రుల శాఖల కేటాయింపుపై కసరత్తులు జరుగుతున్నట్లు తెలిసింది. ఖాళీగా ఉన్న కీలక శాఖలపై సమాలోచనలు చేస్తున్నారు. హైకమాండ్ తో చర్చించి ముగ్గురు మంత్రులకు శాఖలకు కేటాయిస్తున్నారు.
శాఖల కేటాయింపు...
నేడు శాఖల కేటాయింపు పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భర్తీపై చర్చించే చాన్స్ కనిపిస్తుందని తెలిసింది. డిప్యూటీ సీఎం భట్టికి హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆయన కూడా హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడంతో ముగ్గురు వెళ్లి పార్టీ అగ్రనేతలతో చర్చిస్తున్నారు. కార్పొరేషన్ పదవుల భర్తీపై కూడా నేడు క్లారిటీ వచ్చే అవకాశముంది.