Revanth Reddy : రేవంత్ హెచ్చరిక.. దొరికితే వదిలపెట్టం

హైదరాబాద్ ను డ్రగ్స్ హబ్ గా మార్చడానికి ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు

Update: 2025-06-26 13:57 GMT

హైదరాబాద్ ను డ్రగ్స్ హబ్ గా మార్చడానికి ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పటాు చేసిన సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఐటీ ఫార్మా హబ్ గా ఉన్న తెలంగాణ, గంజాయి డ్రగ్స్ హబ్ గా మారితే అందరం విఫలమయినట్లేనని అన్నారు. కళాశాలల్లో గంజాయి, డ్రగ్స్ దొరికినట్లు విచారణలో తేలితే యాజమాన్యాలపై కూడా చర్యలుంటాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

ఈగల్ సంస్థ ను ఏర్పాటు చేసి...
తెలంగాణపై గంజాయి, డ్రగ్స్ నివారణ కోస ఈగల సంస్థను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కోటి అరవై ఎకరాలున్న తెలంగాణలో చిన్న గంజాయి మొక్క ఆచూకీ ఉన్న ఆ గద్దలు పట్టేస్తాయని తెలిపారు. యువ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండల సినిమాలను చూసి కాదని, వారి నిజజీవితాలను చూసి స్ఫూర్తిని పొందాలని రేవంత్ రెడ్డి కోరారు. డ్రగ్స్ కు బానిసలు కాకుండా క్రమశిక్షణమైన జీవితంతో కమిట్ మెంట్ తో ముందడుగు వేస్తే ఖచ్చితంగా యువత విజయాలను అందుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ హీరోలు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ పాల్గొన్నారు.


Tags:    

Similar News