Revanth Reddy : బెంగళూరుకు బయలుదేరిన రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెంగళూరు బయలుదేరి వెళ్లారు.

Update: 2025-10-06 07:35 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. అస్వస్తతకు గురయిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు. ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అస్వస్తతకు గురి కావడంతో ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే బెంగళూరులోని ఒక ఆసుపత్రికి తరలించారు. ఆయనకు పేస్ మేకర్ అమర్చారని తెలిపారు.

ఖర్గేకు పరామర్శ...
అయితే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోగ్యం కుదుటపడుతుందని, ఆయనను పరామర్శించేందుకు నేడు బెంగళూరుకు రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారని, ఖర్గేతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కూడా చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖర్గే తో చర్చించే అవకాశముంది.


Tags:    

Similar News