Telangana : ఉపాధ్యాయులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పారు

Update: 2025-07-27 02:33 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించే ఫైలు పై సంతకం చేశారు. ఈ మేరకు రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ ను విద్యాశాఖ అధికారులు విడుదల చేయనుంది. జూన్ 30వ తేదీ వరకూ ఖాళీగా ఉన్న పోస్టులను పరిగణనలోకి తీసుకుని దాదాపు మూడున్నర వేలమంది ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించనున్నారు.

ఫైలుపై సంతకం చేసి...
గత ఏడాది స్కూలు అసిస్టెంట్లకు గజిటెడ్ హెడ్ మాస్టర్లుగా పదోన్నతి కల్పించారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఐదు వందల వరకూ ఖాళీలున్నాయి. పదవి విరమణ తర్వత ఏర్పడిన ఖాళీలతో రాష్ట్రంలో 900 ఖాళీలున్నాయి. ఇందులో కొన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు లేరు. సీనియర్ అసిస్టెంట్లకు ఇన్ ఛార్జి హెచ్ఎంల బాధ్యతలను ఇచ్చారు. దీంతో పాటు మరికొందరికి పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది.


Tags:    

Similar News