Telanagana : ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా రేవంత్ ప్రజలకు ఇచ్చిన మాట ఇదే

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపకుంటున్నందున ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు

Update: 2025-06-02 02:14 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపకుంటున్నందున ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలసి కట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయి పదకొండేళ్లు పూర్తయి పన్నెండవ ఏట అడుగు పెడుతున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అమరులైన వారి, తర్వాత ప్రాణ త్యాగాలు చేసిన వారిని స్మరించుకున్నారు.

ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన...
తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకన్న కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, జర్నలిస్ట్లు, న్యాయవాదులు, కర్షకులు, కార్మికులు, మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్రాన్ని సరికొత్త విధానంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా భవిష్యత్ ప్రణాళికలను రచిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు.


Tags:    

Similar News