కేసీఆర్ జిల్లా టూర్ షెడ్యూల్ ఖరారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి ఆయన జిల్లాల పర్యటన ఉండనుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి ఆయన జిల్లాల పర్యటన ఉండనుంది. తొలుత కేసీఆర్ జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. అనంతరం నిజామాబాద్, హనుమకొండ, జగిత్యాల, యాదాద్రి, వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో కేసీఆర్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
ప్రారంభోత్సవాలు......
జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల కాంప్లెక్స్ లతో పాటు , పార్టీ జిల్లా కార్యాలయాలను కూడా కేసీఆర్ ప్రారంభించనున్నారు. అన్ని జిల్లాల కేంద్రంలో పార్టీ కార్యాలయాలు ప్రారంభోత్సవానికి రెడీ గా ఉన్నాయి. హైదరాబాద్, వరంగల్ లో తప్ప అన్ని చోట్లా కార్యాలయాలను నిర్మించారు. జిల్లా అధ్యక్షులను నియమించిన తర్వాత కేసీఆర్ తొలిసారి పర్యటనకు వస్తుండటంతో తమ అధినేతకు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేసేందుకు టీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు.