Telangana : నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

Update: 2025-07-28 02:25 GMT

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. కులగణనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్రుల నిపుణు కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించే అవకాశముంది. దీంతో పాటు గోశాల పాలసీపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక కొత్తగా ప్రభుత్వం ప్రారంభించాలని నిర్ణయించిన జూనియర్ కళాశాలల్లో అవసరమైన పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంటుంది.

కీలక అంశాలపైన...
దీంతో పాటు రేషన్ కార్డుల పంపిణీ మార్గదర్శకాలపై కూడా చర్చించే ఛాన్స్ మంత్రివర్గంలో కనిపిస్తుంది. దీంతో పాటు రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత, జిల్లాల్లో మంత్రుల పర్యటనల్లో పరిశీలించిన అంశాలను కూడా చర్చించే అవకాశముంది. సాగునీటి పారుదల ప్రాజెక్టు అంచనాల పెంపుదలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మరికొన్ని కీలక అంశాలపై కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. బనకచర్లతో పాటు నాగార్జున్ సాగర్ నుంచి ఏపీ ప్రభుత్వం నీటిని విడుదల చేసుకున్న అంశంపై కూడా నేడు చర్చించే అవకాశముంది.


Tags:    

Similar News