Telangana : నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం

తెలంగాణ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముంది

Update: 2025-06-16 02:41 GMT

తెలంగాణ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముంది. నెలలో రెండుసార్లు మంత్రి వర్గం సమావేశమవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించిన తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో కీలక అంశాలను చర్చించి ఆమోదించే అవకాశముంది.

రైతు భరోసా, స్థానిక సంస్థల ఎన్నికలపై...
మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రైతు భరోసా నిధుల విడుదలపై చర్చించనున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున నగదును జమ చేయడంపై చర్చిస్తారు. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చించే అవకాశముంది. ముందుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, తర్వాత మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది.


Tags:    

Similar News