Telangana : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2025-11-17 13:03 GMT

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని, పండగ వాతావరణంలో వారోత్సవాలను నిర్వహించాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. డిసెంబరు 8,9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ను కూడా నిర్వహించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నార. దీంతో పాటు మరొక కీలక నిర్ణయం కూడా తీసుకుంది.

డిసెంబరు రెండో వారంలో...
డిసెంబరు రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నిర్ణయించినట్లు తెలిసింది. తొలుత డిసెంబరులో పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని, ఆ తర్వాత మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. డిసెంబరు రెండో వారంలో స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది.


Tags:    

Similar News