Telangana : నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగనుంది. ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై న్యాయస్థానాలు తీర్పు చెప్పడంతో పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించే ఛాన్స్ ఉంది. ఎన్నికలను ఎప్పటి నుంచి నిర్వహించాలన్న దానిపై కూడా చర్చ జరగనుంది.
ఎన్నికల నిర్వహణపై...
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఈనెల 24వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడంతో దీనిపై కేబినెట్ భేటీ నిర్ణయం తీసుకోనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపుతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా వచ్చే అవకాశమున్నందున స్థానిక సంస్థల షెడ్యూల్ పై కేబినెట్ లో చర్చించే ఛాన్స్ ఉంది. దీంతో పాటు దివంగత కవి అందెశ్రీ స్మృతివనంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం విషయంపై కూడా చర్చించే అవకాశాలుున్నాయి.