Telangana : నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం
నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది.
నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు పై జరిగిన అవినీతి అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై చర్చించనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పై కమిషన్ ఇచ్చిన నివేదిక ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. దీంతో దీనిపై చర్చించి నివేదిక ఇవ్వాలంటూ నిపుణుల కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది.
కాళేశ్వరం కమిషన్ నివేదికపై...
నివేదికలో జస్టిస్ పీసీ ఘోష్ చేసిన కామెంట్స్ తో పాటు ఆయన ఇచ్చిన నివేదికలో కీలకమైన అంశాలతో కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన అవినీతిపై ప్రభుత్వం చర్యలకు దిగేందుకు ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అలాగే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి సభలో నివేదిక ప్రవేశపెట్టే అంశంపై కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాల తేదీలను కూడా ఈ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.