Telangana : నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం
తెలంగాణ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు
తెలంగాణ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సచివాలయంలో ఈరోజు మధ్యాహ్నం రెండుగంటలకు మంత్రి వర్గ సమావేశం ప్రారంభం కానుంది. ప్రతి సమావేశంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి కేబినెట్ సమావేశాన్ని స్టేటస్ రిపోర్ట్ మీటింగ్ గా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వంలో ఇప్పటి వరకూ మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుప చర్చించి, అమలు కాకుంటే చర్యలు తీసుకునే అవకాశముంది.
ఇప్పటివరకూ తీసుకున్న...
తెలంగాణ మంత్రి వర్గం ఇప్పటి వరకూ 327 నిర్ణయాలు తీసుకుంది. అవి ఏ మేరకు అమలయ్యాన్నది ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే మేడిబడ్డ బ్యారేజీలో మరమ్మతులపై ఎన్డీఎస్ఏ, విజలెన్స్ ఇచ్చే నివేదికలపై చర్చించనుంది. తర్వాత ఈ నెల 14వ తేదీన రేషన్ కార్డుల జారీపై కూడా చర్చించనున్నారు. ఇక బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు, గోశాలల నిర్మాణాలు, మహిళ సంక్షేమం వంటివి వాటిపైనా మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటు ఫోర్త్ సిటీలో భూ కేటాయింపులపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముందని తెలిసింది